వెలుగు సంస్థలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు : ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా : అపూర్వ స్వాగతం పలికిన సెక్రటరీ ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి
మదనపల్లి,మేజర్ న్యూస్ : భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) పురస్కరించుకుని,మానసిక వికలాంగుల సేవా సంస్థ వెలుగు ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా,ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులతో కలిసి సందడి చేశారు.ఆప్యాయంగా స్వాగతం,ఆకట్టుకున్న నృత్యాలు కార్యక్రమ ప్రారంభానికి ముందు వెలుగు సంస్థ ప్రిన్సిపల్ లీనా కుమారి,సంస్థ సెక్రటరీలు కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను సాదరంగా వేదికపైకి ఆహ్వానించారు.చిన్నారులంతా చిరునవ్వులతో,పుష్పగుచ్ఛాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారుల వద్దకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా పలకరించి,వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి.మిఠాయిల పంపిణీ,ఉపాధ్యాయులకు ఘన సత్కారం
బాలల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా చిన్నారులందరికీ స్వయంగా స్వీట్లు,బిస్కెట్ ప్యాకెట్లు,పండ్లు,ఫలహారాలను పంపిణీ చేసి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు.అనంతరం మానసిక దివ్యాంగులైన చిన్నారులకు ఎంతో ఓపికతో,అంకితభావంతో విద్యాబుద్ధులు నేర్పుతూ సేవలందిస్తున్న ఉపాధ్యాయులందరినీ పేరుపేరునా అభినందిస్తూ.శాలువాలతో ఘనంగా సత్కరించారు.
సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి సేవలకు ప్రశంసలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ సెక్రటరీ ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వెలుగు సంస్థ మానసిక దివ్యాంగులకు అందిస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని,సమాజానికి ఆదర్శప్రాయమని కొనియాడారు.సంస్థ ఆవరణలో నెలకొన్న డ్రైనేజీ సమస్య తన దృష్టికి వచ్చిందని,దీనికి తక్షణమే అవసరమైన నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే వెలుగు వార్డెన్ స్వీటీ మాట్లాడుతూ ప్రజా సేవే పరమావధిగా చేసుకొని మన మదనపల్లె పట్టణంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ పేద,బడుగు,బలహీన వర్గాలకు చేయూతనిస్తూ ఒక గొప్ప సమాజానికి పునాది వేస్తూ ఇలా ఈరోజు తమ అమూల్యమైన సమయాన్ని వెలుగు చిన్నారుల మధ్య గడిపినందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో వెలుగు సంస్థ ప్రతినిధులు,ఉపాధ్యాయ బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు,టిడిపి నాయకులు నవీన్ చౌదరి,ఇడగొట్టి రెడ్డి శేఖర్ (డ్యాన్స్ రెడ్డెప్ప),కంచర్ల మల్లికార్జున నాయుడు,పొన్నీటిపాళ్యం ఎంపీటీసీ బీదం గురునాథ్ యాదవ్,మూడో వార్డు కౌన్సిలర్ రాగినేని కవిత,ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి