గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా వేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*
కర్నూలు, నవంబర్ 14: మొదటి, రెండవ మరియు మూడవ దశ గ్రామ పంచాయతీలకు వరుసగా 26.11.2026, 29.11.2026 మరియు 02.12.2026 తేదీలలో జరగనున్న పోలింగ్ సమయంలో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా (ఇండెలిబుల్ ఇంక్)వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని MPTCS మరియు ZPTCలకు ఈ నెల 5 వ తేదీన, కొన్నింటికి 6 వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలికి, ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి చెరగని సిరా పూయడం జరిగిందన్నారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో, సర్పంచులను మరియు వార్డు సభ్యులను ఎన్నుకోవడానికి అదే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్నారు. ఇటీవల ముగిసిన MPTC మరియు ZPTC ఎన్నికల సమయంలో వేసిన సిరా ఓటర్ల వేళ్లపై ఇంకా కనిపించే అవకాశం ఉన్నందున, 26.11.2026 (మొదటి దశ), 29.11.2026 (రెండవ దశ) మరియు 02.12.2026 (మూడవ దశ) తేదీలలో జరగనున్న గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల పోలింగ్ సమయంలో, ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా వేయాలని కమిషన్ నిర్ణయించిందని, ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు,ఇతర పోలింగ్ అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.