శ్రీకాళహస్త సాూర్య న్యూస్: శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి - మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.
శ్రీకాళహస్తి పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేటకి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కి, పోలీస్ శాఖ ఐజీకి తిరుపతి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన అభినయ రెడ్డి , శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి శనివారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలను అరికట్టి ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని, ఎలాంటి అడ్డంకులు, బెదిరింపులు లేకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా, ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఇందులో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి మేయర్ అభ్యర్థి ,టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసు యాదవ్ పాల్గొన్నారు.
వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి