BREAKING
పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్.. నవ్వుల జాతర ఖాయమంటూ తారక్ ప్రకటన! కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ రుద్ర కోటేశ్వర క్షేత్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ సర్పంచ్ కు 1,50,000 ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచులు కాప్-31 సదస్సులో తీవ్రమవుతున్న శిలాజ ఇంధన వివాదం ప్రత్యేక పిల్లలతో బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ బరిలో భోగి కిరణ్ కుమార్. సాలూర ఘనంగా సహకార వారోత్సవాలు పర్యావరణ పరిరక్షణ, నెట్ జీరో లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ప్రభుత్వ కార్యదర్శి ముదావత్ ఎం.నాయక్ నవంబర్ 27న థియేటర్లలోకి ధనశ్రీ వర్మ తొలి తెలుగు చిత్రం.. హే కన్నమ్మగా మారిన ప్రాజెక్ట్! యర్రగొండపాలెం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కంచర్ల సత్యనారాయణ గౌడ్ కూనీపూర్ లో భూముల రీసర్వేను పరిశీలించిన కలెక్టర్ పుస్తక పఠనం తోనే మేధో శక్తి సాధ్యం ద్రవ్యోల్బణ నియంత్రణలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వ్యూహం

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా!

Select Suryaa Now
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా!

నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. అర్హుల గుర్తింపు, నమోదు ప్రక్రియకు ఎదులాపురంలో సన్నాహాలు

*కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలకు జీవిత బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ఎదులాపురం మున్సిపాలిటీలో అవగాహన సమావేశం నిర్వహించారు.


ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు ఎదులాపురం మున్సిపాలిటీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనున్న ఈ పథకంపై శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత అధ్యక్షతన అవగాహన, సన్నాహక సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అనిత మాట్లాడుతూ.. కులం, మతం, ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులైన తెలంగాణ పౌరులు ఈ పథకం పరిధిలోకి వస్తారని వివరించారు. కుటుంబంలోని ఒక ప్రధాన సంపాదన సభ్యుడిని బీమా కోసం ఎంపిక చేసుకోవచ్చని, బీమా పొందిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.5 లక్షల పరిహారం అందుతుందని పేర్కొన్నారు.
పథకం ప్రారంభానికి ముందే మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అర్హులైన కుటుంబాలను గుర్తించి, వివరాల సేకరణ, నమోదు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్క అర్హ కుటుంబం కూడా పథక ప్రయోజనానికి దూరం కాకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.