BREAKING
మెటాకు భారీ షాక్..ఇటలీలో దాదాపు 90 కోట్ల యూరోల జరిమానా విధింపు బాపట్ల కలెక్టరేట్‌లో SAANS కార్యక్రమ బ్యానర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నటనకు గుడ్‌బై చెప్పడం లేదు.. వస్తున్న పుకార్లపై మాస్టర్ భరత్ స్పష్టత! అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి - గ్లోబల్ ఆర్థిక పోకడలపై నిపుణుల విశ్లేషణ కృత్రిమ మేధస్సు యుగంలో లోహాల డిమాండ్ బోడవాడ ,మండగుంట గ్రామం నందు నామినేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి ఆర్ఎంపి పిఎంపి మండల అధ్యక్షునిగా షాదుల్లా హుస్సేన్ నూతన పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ ప్రజాస్వామ్య పరిరక్షణ కు ఓటు ఆయుధం - రవి ముదిరాజ్ బోదేపల్లి అంగన్వాడీ కేంద్రంలో జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు 'బేర్‌ఫుట్ బాసెస్' విషయంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి స్వర్ణ పర్చూరు -1 కేంద్రంలో నామినేషన్లు స్వీకరించే కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్.. నవ్వుల జాతర ఖాయమంటూ తారక్ ప్రకటన! కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ

కూనీపూర్ లో భూముల రీసర్వేను పరిశీలించిన కలెక్టర్

Select Suryaa Now
కూనీపూర్ లో భూముల రీసర్వేను పరిశీలించిన కలెక్టర్
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  : జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తూ, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే బృందాలు చేపడుతున్న కొలతల విధానం, సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల పరిశీలన తదితర అంశాలను క్షుణ్ణంగా గమనించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ ప్రక్రియకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. గ్రామ సరిహద్దుల నిర్ధారణ చేసే సమయంలోనే సమాంతరంగా ప్రభుత్వ భూముల సర్వేను సైతం చేపట్టి హద్దులను నిర్ణయించి పక్కాగా గుర్తులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫారెస్టు భూముల సర్వే ప్రక్రియను అటవీ శాఖ అధికారుల సమక్షంలో నిర్వహించాలని అన్నారు. తప్పిదాలకు తావులేకుండా వేగవంతంగా రీ సర్వే జరిపిన సర్వేయర్లను ఎంపిక చేసి నగదు పారితోషికాలు అందజేస్తామని ప్రకటించారు. ఈ నెలాఖరు లోపు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించిన వారికి మొదటి బహుమతి కింద రూ. 10వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 5వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 3వేలు, నాలుగు, ఐదవ స్థానంలో ఎంపికైన వారికి రూ.2వేలు, వేయి రూపాయల నగదు పారితోషికం అందజేస్తామని అన్నారు. గడువు సమీపిస్తున్న దృష్ట్యా సెలవు దినాలలో సైతం రీ సర్వే ప్రక్రియను కొనసాగించాలని, తాను కూడా క్షేత్రస్థాయి పరిశీలనలు జరుపుతానని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ యజమానులు, రైతులు కూడా భూ రీసర్వే ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరించాలని, ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రీసర్వే పనుల్లో ఖచ్చితత్వం, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తద్వారా భూ వివాదాలు సమసిపోయి, రైతులకు వారి భూములపై ఖచ్చితమైన హక్కుల నిర్ధారణ అవుతుందన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజాగౌడ్, బోధన్ ఆర్డీఓ విజయ కుమారి, వర్ని తహసీల్దార్ ప్రశాంత్, స్థానిక సర్పంచ్ లక్ష్మణ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, గ్రామ పెద్దలు ఉన్నారు.