సిద్ధార్థ విద్యాలయంలో బాలల దినోత్సవం - ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణ
సూర్య- బిక్కనూర్ : భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్బంగా మండల కేంద్రంలోని స్థానిక సిద్ధార్థ విద్యాలయంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణ వేసి ఆటపాటలతో ఆలరించారు. విద్యార్థులు వేసిన వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చిన్నారులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం పాఠశాల కరెస్పాండంట్ బండి సుధాకర్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతోపాటు క్రీడలు, సాంప్రదాయాలు, ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం మరువలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లింగాల శ్రీకాంత్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు