నూతన పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ
ఆత్మకూరు /సూర్య న్యూస్: ఆత్మకూరు మండలం మేడేపల్లి గ్రామానికి నూతనంగా మంజూరైన పింఛన్ పత్రాలను శనివారం పట్టణంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శ్రీరామ్ రెడ్డి తెలిపారు. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పింఛన్లకు స్థిరపడినట్లు అయిందని ఆయన తెలిపారు. పెన్షన్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెన్నారాయుడు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివ, తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.