BREAKING
ప్రజల భద్రత మా ప్రాధాన్యత – మూగజీవుల సంక్షేమం మా బాధ్యత వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు..

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్

Select Suryaa Now
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు :  జిల్లా ఎస్పీ  బి.ఉమామహేశ్వర్

బాపట్ల, మేజర్‌న్యూస్‌ :

బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేయడంతో పాటు, నామినేషన్ కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS ( సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నామినేషన్ కేంద్రాల్లోకి అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుందని, నామినేషన్ కేంద్రాల వద్దకు ర్యాలీలు, ఊరేగింపులుగా రావడం, గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాలకు 100 నుంచి 200 మీటర్ల పరిధిలో జనసమూహాలుగా గుమిగూడడం, నినాదాలు చేయడం, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం అనుమతించబడదని తెలిపారు.

నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నామని, పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎన్నికల నియమావళి, పోలీస్ శాఖ విధించిన ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సంయమనం పాటిస్తూ పోలీస్ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.