BREAKING
వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన

ఆది సాయికుమార్ 28వ చిత్రం అరుంధతి నక్షత్రం ప్రారంభం.. తండ్రి సాయికుమార్ క్లాప్‌తో షురూ!

Select Suryaa Now
ఆది సాయికుమార్ 28వ చిత్రం అరుంధతి నక్షత్రం ప్రారంభం.. తండ్రి సాయికుమార్ క్లాప్‌తో షురూ!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న నూతన చిత్రం అరుంధతి నక్షత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆది సాయికుమార్ కెరీర్‌లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో మేఘ శెట్టి, మధు దామరాజు కథానాయికలుగా నటిస్తున్నారు. గతంలో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు.

7 పి.ఎం. ప్రొడక్షన్స్, శ్రీ చక్ర మూవీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై సందీప్ అగరం, అష్మిత రెడ్డి బాసాని, డాక్టర్ సూర్యకాంతి కూచిభొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం నిర్వహించిన పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సాయికుమార్ క్లాప్ కొట్టగా, నిర్మాతలు రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం చిత్ర నిర్మాతలు దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.

సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాన్ని గుర్తుచేసే విధంగా మెమొరీ కార్డ్‌లోని ఫొటోలను పోస్టర్లుగా ప్రింట్ చేసి అరుంధతి నక్షత్రం సినిమాను ప్రకటించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ ద్వారా ఇది ఆహ్లాదకరమైన రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందనుందని స్పష్టమవుతోంది.

ఈ నెలలోనే అరుంధతి నక్షత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. తమ నిర్మాణ సంస్థలకు మరింత పేరు తీసుకొచ్చేలా ఈ చిత్రం ఉంటుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఆది సాయికుమార్, రాహుల్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.