BREAKING
వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన

శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు.

Select Suryaa Now
శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు.

కళ్యాణదుర్గం: పట్టణంలోని శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు చిన్నారుల్లో ఆనందోత్సాహాలను నింపాయి. ఈ సందర్భంగా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. చిన్నారుల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమాభిమానాలను గుర్తుచేస్తూ, ప్రతి సంవత్సరం నవంబర్ 14న ఆయన జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. బాలల సమగ్ర అభివృద్ధికి విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థుల కోసం వివిధ రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమలోని ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తోటి విద్యార్థుల కేరింతలు, చప్పట్ల మధ్య పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కె. సునీత సంగప్ప మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తు అని, ప్రతి విద్యార్థిలోనూ ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల ఆసక్తులు, అభిరుచులను గుర్తించి వారిలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు పాఠశాల యాజమాన్యం నిరంతరం ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు. చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకునేలా అవసరమైన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అకడమిక్ డైరెక్టర్లు కె. సంగప్ప, కె. నరసింహాచారి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, నైతిక విలువలు, సేవాభావం అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో అవసరమని వివరించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సి. తిప్పేస్వామి మాట్లాడుతూ విద్యార్థుల ఆనందం, సంతోషం, వారి అభివృద్ధే పాఠశాల అభివృద్ధికి నిజమైన గుర్తింపు అని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆనందాన్ని పంచే ఇలాంటి కార్యక్రమాలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటలు, పాటలు, నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, అకడమిక్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారుల కేరింతలు, సందడి మధ్య బాలల దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాలతో ముగిశాయి.
కళ్యాణదుర్గం ఇంచార్జ్ సుధామోహన్.