మధుమేహంపై ముందస్తు చర్యలు చేపట్టాలి
మధుమేహంపై ముందస్తు అవగాహన, సకాలంలో పరీక్షలు మరియు చికిత్స ఎంతో ముఖ్యమని శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజా బేగం పేర్కొన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని శనివారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మధుమేహంపై ముందస్తు చర్యలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.