రుద్ర కోటేశ్వర క్షేత్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ
రుద్ర కోటేశ్వర క్షేత్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా
- ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఆత్మకూర్, మేజర్ న్యూస్ : నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామ సమీప దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ప్రాచీన ప్రముఖ శివాలయమైన శ్రీ రుద్రాణి సమేత రుద్ర కోటేశ్వర ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ సందర్శించారు. శివుడు స్వయంభు లింగా రూపంలో కొలువైన శ్రీ రుద్రాణి సమేత రుద్ర కోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని సేవించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన కలెక్టర్ రాజకుమారి గనియాకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.