పుస్తక పఠనం తోనే మేధో శక్తి సాధ్యం
జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. పుస్తక పఠనం తోటే మేధో శక్తి సాధ్యమని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం 59వ జాతీయ గ్రంథాలయ ఉమ్మడి జిల్లాల గ్రంధాలయ చైర్మన్ గురవా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవం, మాజీ దేశ ప్రధాని నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేటి ఆధునిక యుగములో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లతో కాలం గడుపుతున్నారని దీని ద్వారా మేధాశక్తిని పూర్తిగా కోల్పోతున్నారన్నారు. విషయ పరిజ్ఞానం కోసం సమాచారం కోసం ప్రస్తుతం ప్రతి ఒక్కరు చాట్ జి బీటి వంటి వాటి ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు. స్వతహాగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నారని అన్నారు. గ్రంథాలయ చైర్మన్ గురవారెడ్డి మాట్లాడుతూ నవంబర్ 14 నుండి 20 తేది వరకు విద్యార్థులకు వివిధ రకాల పోటీలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని గ్రంథాలయాల్లో వారం రోజుల పాటు వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ చేసి ప్రత్యేక యాప్ ద్వారా గ్రంథాలయ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నామని, ఇప్పటికే 50 శాతం నమోదు ప్రక్రియ పూర్తయిందని వివరించారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి ఆర్ వి ఆర్ ఎస్ ఎస్ శర్మ, డిప్యూటీ లైబ్రేరియన్ లావణ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సహదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.