బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
సూర్య- బిక్కనూర్ : మండలంలోని పలు గ్రామాలలో శనివారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని అంతంపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పిట్ల చిన్న గంగయ్య పక్షపాతంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని, ఆయన ఆరోగ్య విషయాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన జీడి సిద్దయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తక్షణ సహాయం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం బిక్కనూర్ పట్టణానికి చెందిన పంచాయతీ రాజ్ లైన్ ఇన్స్‌పెక్టర్ తాటిపాముల కిరణ్ గౌడ్ గుండెపోటుతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వెంట పార్టీ నాయకులు నల్లవెళ్లి అశోక్, కుంభలా రవి, మండల జనరల్ సెక్రటరీ అత్తేల్లి శ్రీనివాస్,అందె మహేందర్, తునికి వేణు, బోండ్ల రాంచంద్రం,మధుసూదన్ రెడ్డి, రంజిత్, సురేందర్ రెడ్డి,గణేష్ రెడ్డి,నరేందర్ రెడ్డి, రామకృష్ణ, నారాయణ, రాజశేఖర్, ప్రభాకర్, శ్రీనివాస్,విష్ణు,బిఆర్ నవీన్,భాస్కర్, బొడ్డు రాజు, గడిల శ్రీనివాస్, లక్ష్మణ్,అంజిరెడ్డి, రవి, బస్వయ్య, శ్రీనివాస్ రెడ్డి, ముదం సత్యం, చంద్రము,బాబు,ఎల్లం,అనిల్,భాను, కొత్తిమీర శ్యామ్, చెలిమేలా భాను కార్యకర్తలు పాల్గొన్నారు.