BREAKING
పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్.. నవ్వుల జాతర ఖాయమంటూ తారక్ ప్రకటన! కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ రుద్ర కోటేశ్వర క్షేత్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ సర్పంచ్ కు 1,50,000 ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచులు కాప్-31 సదస్సులో తీవ్రమవుతున్న శిలాజ ఇంధన వివాదం ప్రత్యేక పిల్లలతో బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ బరిలో భోగి కిరణ్ కుమార్. సాలూర ఘనంగా సహకార వారోత్సవాలు పర్యావరణ పరిరక్షణ, నెట్ జీరో లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ప్రభుత్వ కార్యదర్శి ముదావత్ ఎం.నాయక్ నవంబర్ 27న థియేటర్లలోకి ధనశ్రీ వర్మ తొలి తెలుగు చిత్రం.. హే కన్నమ్మగా మారిన ప్రాజెక్ట్! యర్రగొండపాలెం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కంచర్ల సత్యనారాయణ గౌడ్ కూనీపూర్ లో భూముల రీసర్వేను పరిశీలించిన కలెక్టర్ పుస్తక పఠనం తోనే మేధో శక్తి సాధ్యం ద్రవ్యోల్బణ నియంత్రణలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వ్యూహం

చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ

Select Suryaa Now
చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ
సూర్య జైనూర్:జైనూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేయూత పథకం కింద నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరై, ఏఎంసీ చైర్మన్ కుడుమెత విశ్వనాథరావుతో కలిసి నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఏఎంసీ చైర్మన్ కుడుమెత విశ్వనాథరావు మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.