గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
సూర్య న్యూస్ దర్శి. మన జిల్లాకు చెందిన సినీరంగ ప్రముఖుడు కళామతల్లి ముద్దుబిడ్డ ఎర్ర గిరిబాబు (శేషగిరిరావు) మృతి తెలుగు ప్రజలకు తీరని లోటుని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.
ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మరణం విచారకరమని ,ప్రకాశం జిల్లాలోని రావినూతల లో ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల పాటు 600లకు పైగా చిత్రాల్లో నటించి... విలన్‌గా, హాస్యనటుడిగా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారన్నారు .గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానుఅని ,వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని డాక్టర్ లక్ష్మీ తెలియజేసారు.