BREAKING
పొదిలి నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటి నామినేషన్ దాఖలు. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్.. నవ్వుల జాతర ఖాయమంటూ తారక్ ప్రకటన! కలెక్టరేట్ గ్రంథాలయానికి 18 పుస్తకాలు బహుకరణ రుద్ర కోటేశ్వర క్షేత్రంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ సర్పంచ్ కు 1,50,000 ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచులు కాప్-31 సదస్సులో తీవ్రమవుతున్న శిలాజ ఇంధన వివాదం ప్రత్యేక పిల్లలతో బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ బరిలో భోగి కిరణ్ కుమార్. సాలూర ఘనంగా సహకార వారోత్సవాలు పర్యావరణ పరిరక్షణ, నెట్ జీరో లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : ప్రభుత్వ కార్యదర్శి ముదావత్ ఎం.నాయక్ నవంబర్ 27న థియేటర్లలోకి ధనశ్రీ వర్మ తొలి తెలుగు చిత్రం.. హే కన్నమ్మగా మారిన ప్రాజెక్ట్! యర్రగొండపాలెం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కంచర్ల సత్యనారాయణ గౌడ్ కూనీపూర్ లో భూముల రీసర్వేను పరిశీలించిన కలెక్టర్ పుస్తక పఠనం తోనే మేధో శక్తి సాధ్యం ద్రవ్యోల్బణ నియంత్రణలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వ్యూహం

పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

Select Suryaa Now
పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

 

ఏలూరు, మేజర్ న్యూస్:  శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయసంస్థ, ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో "59 వ"జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఉదయం10:00  గంటలకు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్   జుత్తుగ నాగరాజు  అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్  రెడ్డి అప్పలనాయుడు  పాల్గొని ముందుగా జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా ఏలూరు లో ప్రముఖ నృత్యంజలి కళానికేతన్ నాట్యాచారులు  గండికోట.రాజేష్ బృందం ఆధ్వర్యంలో స్వాగత నృత్య సుమాంజలి నృత్యాన్ని చేసి అలరించారు. అనంతరం చిన్నారులను చైర్మన్, మేయర్ లు శాలువాలతో ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎమ్ శేఖర్ బాబు  39 వ డివిజన్ కార్పొరేటర్  మోతుకూరి సీతా నాగేశ్వరరావు,  సీనియర్ జెమిని టివి ఆర్టిస్ట్, కె సోమ్లా నాయక్ ప్రముఖ జర్నలిస్ట్ & సోషల్ వర్కర్ చలసాని వెంకట సురేంద్ర (పెప్సీ)  ఎ సుబ్బారావు  సీనియర్ సోషల్ వర్కర్ , ప్రముఖ పత్రిక ఆర్టిస్ట్, కార్టూనిస్ట్  ఎం జె సుజయ్ కృష్ణ , వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, జిల్లా కేంద్ర గ్రంథాలయం సిబ్బంది, కార్యాలయం సిబ్బంది, పాఠకులు, తదితరులు పాల్గొని గ్రంథాలయ వారోత్సవాల సభను ఘనంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 :00 గంటలకు మానవతా స్వచంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు పర్యావరణ- పరిరక్షణ సుస్థిరాభివృద్ధి అనే అంశం పై విద్యార్థులకు  వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ ప్రతినిధులు మేథర అజయ్ బాబు, కె కృష్ణారావు, పి రత్నాకరరావు, శ్రీనివాస్, మరియు సంస్థ ముఖ్య నిర్వాహకులు పాల్గొన్నారు.