BREAKING
ప్రజల భద్రత మా ప్రాధాన్యత – మూగజీవుల సంక్షేమం మా బాధ్యత వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు..

రోడ్డుపక్కన వృద్ధుడి దీనస్థితి.. ఆదుకుని ఆశ్రయం కల్పించిన అల్–ఇందద్ ట్రస్ట్!

Select Suryaa Now
రోడ్డుపక్కన వృద్ధుడి దీనస్థితి.. ఆదుకుని ఆశ్రయం కల్పించిన అల్–ఇందద్ ట్రస్ట్!

హిందూపురం: ముక్కడపేట రోడ్డులో గత మూడు రోజులుగా అనారోగ్యంతో, కాళ్లకు గాయాలతో దీనస్థితిలో ఉన్న బాపన్న (60) అనే వృద్ధుడిని అల్–ఇందద్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆదుకున్నారు. కౌన్సిలర్ అజ్మత్ సమాచారం మేరకు వెంటనే స్పందించిన ట్రస్ట్ సభ్యులు వృద్ధుడికి క్షౌరం చేయించి, స్నానం చేయించి ప్రాథమిక సంరక్షణ అందించారు. అనంతరం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత హౌసింగ్ బోర్డు సమీపంలోని సహస్రనామం అనాథ ఆశ్రమంలో చేర్పించి ఆశ్రయం కల్పించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే తమ ట్రస్ట్ లక్ష్యమని అధ్యక్షుడు ఎం.డి.ఎస్. అమన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఉమర్ ఫరూక్, క్యాషియర్ ఎం.డి. అర్ఫాత్, కౌన్సిలర్ అజ్మత్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర