BREAKING
వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన

కార్యకర్తలకు అండగా ఉంటా... ప్రజాసేవే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని.

Select Suryaa Now
కార్యకర్తలకు అండగా ఉంటా... ప్రజాసేవే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని.

**కళ్యాణదుర్గం:** తెలుగుదేశం పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తానని, వారికి ఏ ఆపద వచ్చినా వ్యక్తిగతంగా అండగా నిలబడి ఆదుకుంటానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ప్రజావేదికను నిర్వహిస్తున్నామని, ప్రజాసేవే తన ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా దాడికి గురై తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త చాపిరి మల్లికార్జునను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, పార్టీ నాయకత్వం వారికి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల సేవలను ఎప్పటికీ మరువబోమని, వారి కుటుంబాలకు కూడా అవసరమైన సమయంలో తోడుగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజకీయ విభేదాలను వ్యక్తిగత కక్షలుగా మార్చుకుని దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందన్నారు. శాంతియుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు సాగాలని, కార్యకర్తల భద్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని, అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని అమిలినేని తెలిపారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవడం, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడమే ప్రజావేదిక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అనంతరం నాగరాజు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి సమీపంలోని ఎల్లమ్మ ఆలయం, చిత్రలింగేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద భక్తులు, స్థానికులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా ప్రజలు, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. పర్యటన పొడవునా స్థానికుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. కష్టకాలంలో కార్యకర్తల వద్దకు స్వయంగా వెళ్లి పరామర్శించడం, కుటుంబాలకు భరోసా కల్పించడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అండగా ఉంటూనే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే పర్యటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.