న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నూతన సంవత్సరానికి వినోదభరితమైన ఆహ్వానం పలుకుతూ యంగ్ హీరో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ వీసా – వింటారా సరదాగా చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 1, 2027న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రేమ, స్నేహం, సరదా, యువత జీవితంలోని అనుభవాల సమ్మేళనంగా ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచనుంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ కథలో ఉన్నతమైన కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో స్వదేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థుల జీవితాలు, వారి జీవనశైలి, స్నేహాలు, ప్రేమలు, ఎదురయ్యే ఆసక్తికరమైన పరిస్థితులను వినోదాత్మకంగా ఆవిష్కరించారు.
ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. యూత్‌ఫుల్ కథాంశం, వినోదభరితమైన సన్నివేశాలు, అశోక్ గల్లా – శ్రీ గౌరీ ప్రియ జంట మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మరోవైపు సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు విడుదలైన అనగా అనగా అమెరికా, చింగారి పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
సంజిత్ హెగ్డే ఆలపించిన అనగా అనగా అమెరికా పాట విదేశీ ప్రయాణంలోని ప్రేమ, కొత్తదనం, ఆహ్లాదకరమైన భావాలను ఆవిష్కరిస్తుండగా, సిద్ శ్రీరామ్, లిప్సిక పాడిన చింగారి పాట ప్రేమలోని మధురమైన అనుభూతులను పలికిస్తోంది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన బాణీలు సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలుస్తున్నాయి. ఈ చిత్రంలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియతో పాటు రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వివా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ లవ్, ఫ్రెండ్‌షిప్, ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో తెరకెక్కుతున్న వీసా – వింటారా సరదాగా 2027 నూతన సంవత్సరాన్ని థియేటర్లలో మరింత సందడిగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Also Read: గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.