BREAKING
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత! క్రిప్టో మార్కెట్లో ఊరట - వచ్చే వారంలోగా బినాన్స్ విత్‌డ్రాయల్స్ పూర్తి పునరుద్ధరణ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి జర్మనీ రాకను సమర్ధిస్తున్న ఇటలీ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు: హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా సరికొత్త ప్రతిపాదన గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా! మయన్మార్ విషయంలో తగ్గేదే లేదన్న ఆసియాన్ కార్యకర్తలకు అండగా ఉంటా... ప్రజాసేవే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల స్వయం పాలన దినోత్సవం

గోట్ చిత్రానికి అద్భుత స్పందన.. సక్సెస్ మీట్‌లో చిత్రబృందం ఆనందం!

Select Suryaa Now
గోట్ చిత్రానికి అద్భుత స్పందన.. సక్సెస్ మీట్‌లో చిత్రబృందం ఆనందం!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: సుడిగాలి సుధీర్ హీరోగా, దివ్య భారతి హీరోయిన్‌గా నటించిన చిత్రం గోట్ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. వేదవ్యాస్ దర్శకత్వంలో జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహతేజ క్రియేషన్స్ బ్యానర్లపై మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మాతగా, రవిందర్ రెడ్డి సహ నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించారు. నితిన్ ప్రసన్న కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో చిత్రబృందం తమ ఆనందాన్ని పంచుకుంది.

సక్సెస్ మీట్‌లో నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం మూడేళ్ల పాటు ప్రయాణం చేశామని, ఆ క్రమంలో ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించి సినిమాను పూర్తి చేశామని తెలిపారు. దర్శకుడు వేదవ్యాస్ వచ్చిన తర్వాతే కథకు కొత్త జీవం వచ్చిందని, సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చేలా సినిమాను రూపొందించామని చెప్పారు. చిత్రం చూసిన ప్రతీ ఒక్కరూ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టువదలకుండా నిలబడినందుకు సంతోషంగా ఉందని, తన ప్రయాణంలో ఎదురైన కష్టాలను భవిష్యత్తులో మరో సినిమాగా తీస్తానని పేర్కొన్నారు. ఈ జర్నీలో దివ్య భారతి ఎంతో సహకరించారని, ప్రేక్షకుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.

హీరోయిన్ దివ్య భారతి మాట్లాడుతూ థియేటర్లలో ప్రేక్షకులు గోట్ చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న తీరు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తనపై ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానం అమూల్యమైనదని, సినిమా కోసం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని స్పష్టం చేశారు. ఇబ్బందుల మధ్య కూడా ధైర్యంగా నిలబడిన నిర్మాత చంద్రశేఖర్‌కు, అండగా నిలిచిన దర్శకుడు వేదవ్యాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

దర్శకుడు వేదవ్యాస్ మాట్లాడుతూ సినిమాకు థియేటర్లలో లభిస్తున్న స్పందన తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు. బెట్టింగ్ అనేది సరదా వరకే పరిమితం కావాలని, హద్దులు దాటకూడదనే విషయాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశామని, ఈ సినిమా చూసి ఒక్కరు బెట్టింగ్ మానేసినా తమ కష్టం సార్థకమైనట్లేనని అన్నారు. మీడియా, ప్రేక్షకులు, చిత్ర యూనిట్ సభ్యులందరి సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.