BREAKING
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత! క్రిప్టో మార్కెట్లో ఊరట - వచ్చే వారంలోగా బినాన్స్ విత్‌డ్రాయల్స్ పూర్తి పునరుద్ధరణ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి జర్మనీ రాకను సమర్ధిస్తున్న ఇటలీ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు: హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా సరికొత్త ప్రతిపాదన గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా! మయన్మార్ విషయంలో తగ్గేదే లేదన్న ఆసియాన్ కార్యకర్తలకు అండగా ఉంటా... ప్రజాసేవే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల స్వయం పాలన దినోత్సవం

గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

Select Suryaa Now
గ్రామ పంచాయతీల్లో  సర్పంచ్, వార్డు సభ్యుల  ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు*  *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

 

కర్నూలు, నవంబర్, 14 :   గ్రామాల్లో సామరస్యం, ఐక్యత,  ఏకాభిప్రాయంతో కూడిన స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయాలనే లక్ష్యంతో  రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవమయ్యే  గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలను అందిస్తోందని  జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి  ఒక ప్రకటనలో తెలిపారు. *

ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులున్న గ్రామ పంచాయతీలకు 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15 లక్షలు,  5,001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు  50 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన అనంతరం ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుందన్నారు.

గతంలో 2 వేల లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే 5 లక్షల రూపాయలు, 2001 నుండి 5000 జనాభా గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయలు, 5001 నుండి 10 వేల లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు 15 లక్షల రూపాయలు, 10 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయలు ప్రోత్సాహకాలుగా అందించే వారని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం  ప్రస్తుతం జనాభా ననుసరించి   15 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు పెంచిందన్నారు.   ఎన్నికల అధికారులు సర్పంచ్ మరియు అన్ని వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలను ఏకగ్రీవంగా అధికారికంగా ప్రకటించిన గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని కలెక్టర్ వివరించారు