BREAKING
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత! క్రిప్టో మార్కెట్లో ఊరట - వచ్చే వారంలోగా బినాన్స్ విత్‌డ్రాయల్స్ పూర్తి పునరుద్ధరణ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి జర్మనీ రాకను సమర్ధిస్తున్న ఇటలీ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు: హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా సరికొత్త ప్రతిపాదన గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా! మయన్మార్ విషయంలో తగ్గేదే లేదన్న ఆసియాన్ కార్యకర్తలకు అండగా ఉంటా... ప్రజాసేవే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల స్వయం పాలన దినోత్సవం

గ్రంధాలయం లో బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
గ్రంధాలయం లో బాలల దినోత్సవ వేడుకలు

గ్రంథాలయంలో బాలల దినోత్సవ వేడుకలు
కనిగిరి ,మేజర్ న్యూస్ :59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మరియు బాలల దినోత్సవాన్ని కనిగిరి గ్రంథాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రంథపాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి ఎన్ తులసీ రామయ్య ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.నెహ్రూ జయంతి సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి నెహ్రూ దేశ అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు .పిల్లలతో గడిపిన సమయాన్ని అత్యంత ప్రాధాన్యంగా చూసిన నేత నెహ్రూ పుట్టిన రోజునే బాలల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు .గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఉపాధ్యాయులు బోయర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భారత పౌరులు. బాలల హక్కులు, వారి స్వేచ్ఛ పట్ల నెహ్రూ చూపిన దృక్పథం శాశ్వత ప్రేరణ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని షేక్ జైనాబి, రిటైర్డ్ ఉపాధ్యాయులు షఫీ ,మస్తాన్ ,రంతుల్లా ,విద్యార్థులు గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.