సూర్య,సారంగాపూర్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని,ఎస్సై శ్రీకాంత్ వాహనదారులను హెచ్చరించారు.జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శనివారం రోజు మండల పరిధిలోని మలక్ చించోలి ఎక్స్ రోడ్ వద్ద,వాహన తనిఖీలు, నిర్వహించి సరైన పత్రాలు లేని 30 మంది వాహనదారులకు,జరిమానా, విధించినట్లు ఆయన తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.