telangana
జేత్వన్ బుద్ధ విహార్‌లో నెహ్రూ, సుబేదార్ రాంజీ జయంతి వేడుకలు
సూర్య వాంకిడి : వాంకిడి మండల కేంద్రంలోని జేత్వన్ బుద్ధ విహార్‌లో భారత మాజీ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తండ్రి సుబేదార్ రాంజీ సక్పాల్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ మహుల్కర్, సమతా సైనిక్ దళ్ జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు విజయ్ ఉప్రే మాట్లాడుతూ.. దేశానికి, సమాజానికి విశేష సేవలందించిన మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. వారు సమాజ అభ్యున్నతికి చేసిన కృషి, ప్రజల హక్కుల కోసం సాగించిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా ఆర్గనైజర్ రోషన్ ఉప్రే, బౌద్ధ సమాజ్ అధ్యక్షుడు దుర్గం శ్యామ్‌రావు, రాజేశ్వర్, బుద్ధ ఉపాసకులు పాండుజీ జాడే, రమేష్ దొంగ్రే, అంబేడ్కర్ సంఘం నాయకులు రాకేష్ దుర్గే, జాడే మారుతి, భీమ్‌రావు, సమతా సైనిక్ దళ్ మార్షల్స్ దుర్గం మనోజ్, సంతోష్, బుద్ధాజీ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.