BREAKING
సీన్ లీక్ కావడంతో హడావుడిగా టీజర్ రిలీజ్.. ఛప్రి ఈవెంట్‌లో బండి సరోజ్ కుమార్ భావోద్వేగం! వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి :నాయుడ్నూర్ పవన్ రావు బాలలే భావి భారత పౌరులు – విద్యార్థులకు విద్యా సామగ్ర పంపిణీ - డాక్టర్అ మృత్ కాబోయే ఎంపీపీ పువ్వాడి దంపతులకు సన్మానం ఫుట్ పాత్ పై కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులపై దౌర్జన్యం నెలవారీగా ఒక్కొక్కరు రూ. 1500 ఇవ్వాలని డిమాండ్ సినిమా నిర్మాత / యాక్టర్ గిరిబాబు గారి మృతి పట్ల మాగుంట సంతాపం శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలి మాజీ ఎమ్మెల్యే బియ్యపు గ్రంధాలయం లో బాలల దినోత్సవ వేడుకలు ప్రజలందరూ మధుమేహంపై అవగాహన పెంచుకొవాలి-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మౌంట్ ఫోర్ట్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయుల నృత్యాలు, కోలాట ప్రదర్శనలు.. విద్యార్థుల్లో ఉత్సాహం మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి! గోట్ చిత్రానికి అద్భుత స్పందన.. సక్సెస్ మీట్‌లో చిత్రబృందం ఆనందం! ప్రాణాలకు తెగించి.. జాలర్లకు పునర్జన్మ! గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

వైసీపీకి మరో భారీ షాక్.. టీడీపీలోకి పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్

Select Suryaa Now
వైసీపీకి మరో భారీ షాక్.. టీడీపీలోకి పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్

సూర్య స్టేట్ బ్యూరో.

గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలం పిట్టకాయగుళ్ల పంచాయతీలో వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గిద్దలూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్ నర్రా సత్యనారాయణ రెడ్డి గారు తన అనుచరులతో కలిసి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. నర్రా వెంకటేశ్వర రెడ్డి, నర్రా అంకిరెడ్డి, చేగిరెడ్డి పోతిరెడ్డి, కార్తీక్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నర్రా సత్యనారాయణ రెడ్డి గారితో పాటు నర్రా వేణుగోపాల్ రెడ్డి, పెళ్లా రెడ్డి, ఆవుల అంకిరెడ్డి తదితరులకు ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి, వేయించి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని వారు తెలిపారు.