BREAKING
సీన్ లీక్ కావడంతో హడావుడిగా టీజర్ రిలీజ్.. ఛప్రి ఈవెంట్‌లో బండి సరోజ్ కుమార్ భావోద్వేగం! వ్యాపారంలో రాణించి ఆర్ధికంగా ఎదగాలి :నాయుడ్నూర్ పవన్ రావు బాలలే భావి భారత పౌరులు – విద్యార్థులకు విద్యా సామగ్ర పంపిణీ - డాక్టర్అ మృత్ కాబోయే ఎంపీపీ పువ్వాడి దంపతులకు సన్మానం ఫుట్ పాత్ పై కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులపై దౌర్జన్యం నెలవారీగా ఒక్కొక్కరు రూ. 1500 ఇవ్వాలని డిమాండ్ సినిమా నిర్మాత / యాక్టర్ గిరిబాబు గారి మృతి పట్ల మాగుంట సంతాపం శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలి మాజీ ఎమ్మెల్యే బియ్యపు గ్రంధాలయం లో బాలల దినోత్సవ వేడుకలు ప్రజలందరూ మధుమేహంపై అవగాహన పెంచుకొవాలి-ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మౌంట్ ఫోర్ట్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయుల నృత్యాలు, కోలాట ప్రదర్శనలు.. విద్యార్థుల్లో ఉత్సాహం మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు దోమల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి! గోట్ చిత్రానికి అద్భుత స్పందన.. సక్సెస్ మీట్‌లో చిత్రబృందం ఆనందం! ప్రాణాలకు తెగించి.. జాలర్లకు పునర్జన్మ! గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి*

ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఘనంగా ప్రపంచ మధుమేహ దినోత్సవం

Select Suryaa Now
ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఘనంగా ప్రపంచ మధుమేహ దినోత్సవం

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

 ప్రపంచ మధుమేహ దినోత్సవం–2026ను పురస్కరించుకుని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో శనివారం పలు అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) ఆదేశాల మేరకు కళాశాల ADME/ప్రిన్సిపాల్ డా. ఎస్. శ్రీవాణి పర్యవేక్షణలో, NSS నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జి. అశ్వన్ సమన్వయంతో ఈ కార్యక్రమాలు జరిగాయి.

ఈ సందర్భంగా ఒంగోలు ప్రభుత్వ కళాశాల ఆవరణలో మధుమేహం, అధిక బరువు, స్థూలకాయం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మధుమేహం కారణంగా తలెత్తే కిడ్నీ, గుండె, కంటి సంబంధిత సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.

అనంతరం ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు, జూనియర్ వైద్యులు మానవహారం ఏర్పాటు చేసి మధుమేహ నియంత్రణపై నినాదాలతో చైతన్యం కల్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఫ్లాష్‌మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. ఎస్. శ్రీవాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. భాస్కరీ మాట్లాడుతూ.. మధుమేహాన్ని నియంత్రించడంలో ఆహారపు అలవాట్లు, ప్రతిరోజూ వ్యాయామం, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సమతుల ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మధుమేహ ముప్పును తగ్గించుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. వినీల ప్రియాంక, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. రాధిక, డా. దివ్య, డా. లక్ష్మ నాయక్, సోషల్ సైన్సెస్ లెక్చరర్ ఎం.వి. రవిశంకర్, సోషల్ వర్కర్ పి.ఎస్. వాస్, పీజీ విద్యార్థులు డా. సుదర్శన్, డా. హెప్సిబా, డా. హిమజ, డా. జైరాం, డా. లక్ష్మీదేవి, ఇంటర్న్ వైద్యులు పాల్గొన్నారు.