telangana
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత పాఠశాలల్లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.మండల కేంద్రంలోని పెంచికల్‌పేట్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు భాష, ఉపాధ్యాయులు సంతోష్, భాగ్యశ్రీ, మౌనిక, విజయ్ పాల్గొని బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.ఎల్లూరు పాఠశాలలో గ్రామ సర్పంచ్ చప్పిడే రవీందర్ పాల్గొని విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. దేశ భవిష్యత్తు చిన్నారుల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ విద్య, ఆరోగ్యంతో ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టీయూవీ ఉద్యమ కార్యదర్శి చప్పిడే సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు బి. మల్లేశ్, ఉపాధ్యాయురాలు బి. సాయి మాధురి, అంగన్‌వాడీ టీచర్ భూలక్ష్మి పాల్గొన్నారు.దరోగపల్లి మండల ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్ బొట్టుపెల్లి కృష్ణవేణి-హరీష్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మధుకర్, ఉపాధ్యాయులు రామకృష్ణ, రాజన్న, అంగన్‌వాడీ టీచర్ సరోజన, గ్రామస్తులు పుల్ల రమేష్, దస్రు తదితరులు పాల్గొన్నారు.నందిగామ గ్రామంలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నైతం హనుమంత్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరో వార్డు సభ్యుడు ఆలం బానయ్య విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ సిడాం నర్మద, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.కమ్మర్‌గాం పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో గ్రామ సర్పంచ్ కొండ్రా సులోచన భాస్కర్ గౌడ్, ఉపసర్పంచ్ తిరుపతి పాల్గొని విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తు అని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆనందం అందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పిల్లల కలలు సాకారమై ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.