BREAKING
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత! క్రిప్టో మార్కెట్లో ఊరట - వచ్చే వారంలోగా బినాన్స్ విత్‌డ్రాయల్స్ పూర్తి పునరుద్ధరణ నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లోకి జర్మనీ రాకను సమర్ధిస్తున్న ఇటలీ న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న వీసా – వింటారా సరదాగా.. అశోక్ గల్లా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! గిరిబాబు గారు ఆత్మకు శాంతి చేకూరాలి గ్రామ పంచాయతీ, కందుకూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీస్ బందోబస్తు: హౌసింగ్ బోర్డులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా సరికొత్త ప్రతిపాదన గిరిబాబు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా! మయన్మార్ విషయంలో తగ్గేదే లేదన్న ఆసియాన్ కార్యకర్తలకు అండగా ఉంటా... ప్రజాసేవే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల స్వయం పాలన దినోత్సవం

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు వేదిక బాలల దినోత్సవం

Select Suryaa Now
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు వేదిక బాలల దినోత్సవం
సూర్య, మందమర్రి : పట్టణంలోని కార్మెల్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. శనివారం నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారులు తమలోని సృజనాత్మకతకు పదునుపెట్టి వివిధ కళారూపాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఫ్యాన్సీ డ్రెస్‌లతో విభిన్న పాత్రల్లో దర్శనమిస్తూ, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణాన్ని సందడిగా మార్చారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా కార్మెల్ అకాడమీ డైరెక్టర్ ఫాదర్ జేవీఆర్ రెక్స్ ఎస్.జే. మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పుస్తక జ్ఞానంతోపాటు కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడం కూడా విద్యలో భాగమేనని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు అభినందనీయమ న్నారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, అలాంటి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిం చాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. వేడుకల్లో భాగంగా వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలను నిర్వహించి విద్యార్థుల ఆలోచనా శక్తి, సృజనాత్మకతకు అవకాశం కల్పించారు. చిన్నారుల ప్రదర్శనలను చూసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు రెక్స్, సాఫీను, జిజో, షిబుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.