పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం:ఎంపీడీవో బాలాజీ
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం: ఎంపిడిఓ బాలాజీ
పెద్దపంజాణి, మేజర్ న్యూస్:
పెద్దపంజాణి మండలంలో జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఉత్తర్వుల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ను అనుసరించి పెద్దపంజాణి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు పెద్దపంజాణి ఎంపీడీవో బాలాజీ తెలిపారు. మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలనిర్వహణపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ బాలాజీ అధ్యక్షతన రిటర్నింగ్ అధికారులు , సహాయ రిటర్నింగ్ అధికారులు , పంచాయతీ అభివృద్ధి అధికారులు మరియు కార్యాలయ సిబ్బందితో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ మాట్లాడుతూ, రేపటి నేటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు సంబంధించి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నామినేషన్ ఫారాలు, కవర్లు మరియు ఇతర ఎన్నికల సామాగ్రి నిఇప్పటికే సిద్ధం చేసి, సంబంధిత ఆర్వో లకు అందజేసి వాటిని నామినేషన్ కేంద్రాలకు తరలించడమైందన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దపంజాణి తహసీల్దార్ జి. రామమూర్తి, స్థానిక ఎస్.ఐ. సురేష్ బాబు నామినేషన్ కేంద్రాల వద్ద, సమస్యాత్మక గ్రామాలలో తీసుకోవాల్సిన శాంతిభద్రతల చర్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అధికారులకు తగు సూచనలు అందించారు. సిబ్బంది అందరూ పూర్తి సమన్వయంతో పనిచేసి, ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎంపిడిఓ బాలాజీ ఆదేశించారు.
ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి