BREAKING
నవభారత్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.. గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ కళ్యాణదుర్గంలో వివేకానంద పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ సంబరాలు. 107 ఏళ్ల వయసులో కన్నుమూసిన యూసుఫ్.. సర్జఖాన్‌పేటలో విషాదం వరద ఆంజనేయ స్వామికి విశేషంగా పూజలు హొళగుంద, సూర్య ప్రతినిధి: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో కొలువైన వరద ఆంజనేయ స్వామికి శనివారం విశేషంగా పూజ నిర్వహించారు.ఆలయ అర్చకులు జేరుబండి నాగరాజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ మహా మంగళహారతి పూజలను నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. వచ్చిన మోసపోయిన వారికి అండగా నిలుస్తాం : విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ నరసరావుపేటలో తొలిరోజు 55 నామినేషన్లు దాఖలు. కమిషనర్ బి. రమ్య కీర్తన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోత్సాహం పిల్లలకు భవిష్యత్తా? బాల్యమా? పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన కొత్వాల్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సాయి కృష్ణ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కక్షలు వదిలేద్దాం.. గ్రామాల్లో శాంతిని కాపాడుకుందాం!.. వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతి సందేశ కరపత్రాల ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌, కొల్లూరులో నిర్మాణ ప్రాజెక్టులతో పెరగుతున్న వాయు కాలుష్యం

పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: పదవులు తాత్కాలికమే అయినా ప్రజల కోసం చేసిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయని తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగి పదవీకాలం పూర్తి చేసుకున్న గోరేటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల సేవలు అభినందనీయమని కొనియాడారు. శనివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ కౌన్సిల్ భవనాల కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ముగ్గురు మాజీ ఎమ్మెల్సీల సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితో కలిసి గోరేటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, బొగ్గారపు దయానంద్‌లను ఘనంగా సన్మానించారు.అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం వీడ్కోలు సమావేశం కాదని, ముగ్గురు సభ్యుల సేవలను గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపే ఆత్మీయ సమావేశమని అన్నారు. శాసనమండలిలో వారు మాట్లాడిన ప్రతి మాట ప్రజల గొంతుకగా నిలిచిందని, లేవనెత్తిన ప్రతి అంశం ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడిందని పేర్కొన్నారు. శాసనమండలి కేవలం చట్టాలు చేసే సభ మాత్రమే కాదని, ఆలోచనలకు పదును పెట్టే, అనుభవాలను పంచుకునే వేదిక అని వివరించారు. పదవీకాలం ముగిసినా తెలంగాణకు వారి అనుభవం, ప్రజలకు వారి సూచనలు ఎప్పటికీ అవసరమని అన్నారు. రాజకీయాల్లో ఫుల్‌స్టాప్ ఉండదని, ప్రజాసేవలో విరామం ఉండదని పేర్కొంటూ ముగ్గురు సభ్యులు భవిష్యత్తులోనూ ప్రజాసేవలో కొనసాగాలని, యువతకు తమ అనుభవాలను పంచుతూ మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షించారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… ముగ్గురు ఎమ్మెల్సీలు సభలో ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించి విలువైన సేవలు అందించారని ప్రశంసించారు. వారు కేవలం ఎమ్మెల్సీ పదవుల నుంచే విరమించుకున్నారని, ప్రజాసేవ నుంచి కాదని అన్నారు. గోరేటి వెంకన్న ప్రజా గాయకుడిగా, బొగ్గారపు దయానంద్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి అనంతరం ప్రజాసేవలో, బస్వరాజ్ సారయ్య రాజకీయ నాయకుడిగా కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఎమ్మెల్సీ వరకు వివిధ హోదాల్లో విశేష సేవలు అందించారని వివరించారు.చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… ముగ్గురు సభ్యులు శాసనమండలిలో ఎంతో గౌరవంగా, హుందాగా వ్యవహరించారని, సభకు, ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు అందిస్తూ భావితరాల సభ్యులకు మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్మూరి వెంకట్, ఎమ్మెల్సీలు వాణీదేవి, కోటిరెడ్డి, అంజిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఏవీఎన్ రెడ్డి, భానుప్రసాద్ రావు, శాసనమండలి కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్. తిరుపతి, శాసనసభ, శాసనమండలి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.