BREAKING
పటాన్‌చెరు మినీ ఇండియా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక! నీలం మధు ముదిరాజ్ ఆసక్తికరంగా 'మోసపోయాం జానకి' టైటిల్ పోస్టర్.. రద్దు చేసిన పాత నోట్లతో సరికొత్త క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ కోరా జాన్సన్ ఏఎన్‌సీ పాఠశాలల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు చినమామిడిపల్లిలో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత సాధన అద్వితీయమైన శక్తి ఈజిప్ట్‌లో గ్యాస్ ఇందన ప్రారంభించిన షెల్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి, మెదక్ జట్లు ఛాంపియన్లు వైభవంగా ఛత్ పూజ వేడుకలు.. ప్రకృతి ఆరాధనతో మార్మోగుతున్న నదీ తీరాలు

మోసపోయిన వారికి అండగా నిలుస్తాం : విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్

Select Suryaa Now
మోసపోయిన వారికి అండగా నిలుస్తాం : విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్
.హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి మోసానికి గురైన బాధితులకు విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అండగా నిలుస్తుందని కన్వీనర్ గిరి ప్రసాద్ శర్మ పేర్కొన్నారు. ఈమెరకు ఆయన శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. పెట్టుబడుల ఆశ చూపి మోసం చేసిన సంస్థల అంతు చూసేందుకు తమ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ధన్వంతరి, అక్షర చిట్ ఫండ్ వంటి సంస్థల కారణంగా మోసపోయిన బాధితులకు నేటికీ న్యాయం జరగలేదన్నారు. చట్టంలో  లోసుగులను ఆసరాగా చేసుకుని ఆ సంస్థల యాజమాన్యాలు తప్పించుకు తిరుగుతున్నాయని సూచించారు. బాధితులకు న్యాయం చేయాల్సిన సంస్థలు ఉద్యోగుల లేమితో మోసగాళ్లను చట్టం ముందు దోషులుగా నిలబెట్టడంలో విఫలమవుతున్నారని చెప్పారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ( సిట్), క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) సెంట్రల్ క్రైమ్ స్టేషన్( సి సి ఎస్) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడి )విభాగాలను కలిపి ఒక్కటిగా చేయాలని కోరారు. దీని ద్వారా సిబ్బంది కొరత తీరటం తో పాటు, బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. నేరాలపై తక్షణ చర్యలు తీసుకోకుంటే వాటి సంఖ్య పెరిగే అవకాశాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయన్నారు.  మోసం చేసిన సంస్థల ఆస్తులు, నల్లధనాన్ని వెంటనే జప్తు చేసి బాధితులకు పంచాలని సూచించారు. దీనిని రాష్ట్ర డిజిపి సీవీ ఆనంద్, నూతన సిపి డాక్టర్ మహేష్ భగవత్ పరిగణలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.