నరసరావుపేటలో తొలిరోజు 55 నామినేషన్లు దాఖలు. కమిషనర్ బి. రమ్య కీర్తన
నరసరావుపేట: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజైన శనివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ బి. రమ్య కీర్తన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిరోజు వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఇతరుల నుంచి మొత్తం 55 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. పార్టీల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ నుంచి 40, తెలుగు దేశం పార్టీ నుంచి 10, జనసేన నుంచి 2, బీఎస్పీ నుంచి 1, కాంగ్రెస్ నుంచి 1, ఇతరుల నుంచి 1 నామినేషన్ దాఖలైనట్లు కమిషనర్ వివరించారు. మొత్తంగా తొలిరోజు 55 నామినేషన్లు అందినట్లు ఆమె పేర్కొన్నారు.
మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..