BREAKING
ఘనంగా నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా వేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలకు సర్వం సిద్ధం పంటల పరిశీలన.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు! కొమరోలులో కృషోన్నతి యోజన కార్యక్రమం పరిశ్రమలు, ప్రకృతి సందర్శనలతో విద్యార్థులకు విజ్ఞాన యాత్ర ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఘనంగా ప్రపంచ మధుమేహ దినోత్సవం ఛత్ మహా పర్వదిన వేడుకల్లో కీలక ఘట్టం సమస్యల వలయంలో చంపాపేట్ దివ్యాంగుల సదనం గడ్డం వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ముత్తుముల కృష్ణ కిషోర్ ఛత్ పూజ: ప్రకృతి ఆరాధన మరియు పర్యావరణ పరిరక్షణ సంగమం ఘనంగా నాయి బ్రాహ్మణ కార్తీక వన మహోత్సవం! సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్.. రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అబుదాబి టాలరెన్స్ మరియు కోఎగ్జిస్టెన్స్ ఫెస్టివల్‌లో భారత్‌కు అరుదైన గౌరవం కజిరంగా ఘోర రోడ్డు ప్రమాద బాధితులకు అస్సాం ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం

భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

Select Suryaa Now
భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

 

సూర్య జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రమని ప్రపంచానికి చూపించడం కోసం భారత వ్యతిరేక శక్తులతో ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి మాట్లాడుతూ భారత్ సమ్మిట్ సమావేశంలో పెట్టుబడుల కోసం కాకుండా ప్రజాస్వామ్యం, సామాజిక,ఆర్థిక న్యాయం, యువత, జెన్ జెడ్, సర్ ప్రక్రియ, లాంటి మొదలగు అంశాలు చర్చకు పెట్టి దేశంలో జాతీయ సమైక్యతకు భంగం కలిగించే ప్రక్రియకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టి విదేశాల నుండి 1000 మంది ప్రతి నిదులను ఆహ్వానించి ఏ రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో లేని రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా పిలిచి కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వాడుకోవాలని చూస్తుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జగత్యాల పట్టణ అధ్యక్షులు కాశెటి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, జిల్లా పదాధికారులు, జిల్లా మోర్చా అధ్యక్షులు,ఫ్లోర్ లీడర్స్ వేముల శ్రీనివాస్,సిరిపురం శ్రీనివాస్, స్వరూప వేణుగోపాల్, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు