telangana
సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సూర్య, రామకృష్ణాపూర్ : స్థానిక సెయింట్ జోసెఫ్స్ హైస్కూల్‌లో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం వివిధ ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమలోని ప్రతిభను చాటుకున్నారు.వివిధ కళా సాంస్కృతిక ప్రదర్శనలతో చిన్నారులు అలరించగా, ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య బాలల దినోత్సవ వేడుకలు ఉల్లాసభరితంగా సాగాయి. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఈదునూరి సారంగరావు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించడంతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ, సత్ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు. తోటి వారితో స్నేహభావంతో మెలుగుతూ, పెద్దల పట్ల గౌరవం, గురువుల పట్ల విధేయత కలిగి ఉండాలని తెలిపారు. అలాగే దైవభక్తి, నైతిక విలువలను జీవితంలో భాగంగా చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.