నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ జగదీష్ అదహళ్లి తనిఖీలు
నరసరావుపేట : మున్సిపల్ ఎన్నికల నామినే షన్ల ప్రక్రియ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో శినివారం ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారు లకు పలు సూచనలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల నిబంధన లు ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. అభ్యర్థులకు పూర్తి భద్రత కల్పిస్తామని, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా వచ్చి నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ పర్యటనలో ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్, నరసరావుపేట ఏఎస్పీ ఎం. హనుమంతరావు, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి.