మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం......
మద్దూర్ .......మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామానికి చెందిన కోడిపల్లి యాదయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు శనిగారం సత్యనారాయణ మృతుని కుటుంబాన్ని శనివారం పరామర్శించి 10000 ల రూపాయల ఆర్థిక సాయం అందజేసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడి పల్లి యాదయ్య మృతి కుటుంబానికి తీరని లోటని తమ కుటుంబానికి ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తూ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాగుల బాల్ నర్సయ్య, ఎల్లయ్య, మహేష్ ,కనకయ్య, మైపాల్ రెడ్డి, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.