BREAKING
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోత్సాహం పిల్లలకు భవిష్యత్తా? బాల్యమా? పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన కొత్వాల్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సాయి కృష్ణ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కక్షలు వదిలేద్దాం.. గ్రామాల్లో శాంతిని కాపాడుకుందాం!.. వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతి సందేశ కరపత్రాల ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌, కొల్లూరులో నిర్మాణ ప్రాజెక్టులతో పెరగుతున్న వాయు కాలుష్యం సింగీతంలో గ్రామంలో ఘనంగా బాలల గ్రామసభ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసి సన్మానించిన రాప్తాడు జడ్పిటిసి జయలక్ష్మి! పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం:ఎంపీడీవో బాలాజీ సెయింట్ థెరిస్సా పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రైతుల సమక్షంలోనే భూముల రీ సర్వే చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ జగదీష్ అదహళ్లి తనిఖీలు సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

టీఎంఆర్ విద్యాసంస్థల్లో వైభవంగా బాలల దినోత్సవ వేడుకలు సంప్రదాయ దుస్తులు, విభిన్న వేషధారణలతో అలరించిన విద్యార్థులు బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం: కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి

Select Suryaa Now
టీఎంఆర్ విద్యాసంస్థల్లో వైభవంగా బాలల దినోత్సవ వేడుకలు  సంప్రదాయ దుస్తులు, విభిన్న వేషధారణలతో అలరించిన విద్యార్థులు  బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం: కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి

చిట్టమూరు మేజర్ న్యూస్

చిట్టమూరు మండలం కొత్తగుంటలోని తంబిరెడ్డి మనోహర్ రెడ్డి (టీఎంఆర్) విద్యాసంస్థల కరస్పాండెంట్ తంబిరెడ్డి మనోహర్ రెడ్డి, డైరెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం చిన్నారుల సందడి,కేరింతలు,ఆటపాట లతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, విభిన్న వేషధారణలతో వేడుకల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులలోని సృజనాత్మకతను,కళా నైపుణ్యాలను వెలికితీసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు,వివిధ కళారూపాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థుల ప్రదర్శనలు,వారి ప్రతిభాపాటవాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాధారణంగా తరగతి గదులకే పరిమితమయ్యే విద్యార్థులు ఈ వేడుకల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ తంబిరెడ్డి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తు,వారి అభ్యున్నతిపైనే సమాజ ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి బాలుడికి విద్యతోపాటు సంస్కారం,క్రమశిక్షణ, మానవతా విలువలు అలవడినప్పుడే వారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సహజంగా ఉండే ఆసక్తి, సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. చదువులో రాణించడంతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభ కనబరిచేలా విద్యార్థులను ప్రోత్సహించాలని,ప్రతి చిన్నారి తనకు  నచ్చిన రంగంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా నాణ్యమైన విద్య, అనుకూలమైన వాతావరణం కల్పించడమే తమ విద్యాసంస్థల ధ్యేయమని వివరించారు.విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదల, కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అనంతరం కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి, డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ రహమతుల్లా విద్యార్థులకు వివిధ రకాల ఆటలు, వినోదభరిత పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతోపాటు, వారిలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించేందుకు చక్కని వేదికగా నిలిచాయి.ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్