BREAKING
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రోత్సాహం పిల్లలకు భవిష్యత్తా? బాల్యమా? పదవులు ముగిసినా ప్రజాసేవలో కొనసాగాలి.. ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐక్య పోరాటాల ద్వారానే హక్కుల సాధన కొత్వాల్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సాయి కృష్ణ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కక్షలు వదిలేద్దాం.. గ్రామాల్లో శాంతిని కాపాడుకుందాం!.. వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతి సందేశ కరపత్రాల ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌, కొల్లూరులో నిర్మాణ ప్రాజెక్టులతో పెరగుతున్న వాయు కాలుష్యం సింగీతంలో గ్రామంలో ఘనంగా బాలల గ్రామసభ ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మను కలిసి సన్మానించిన రాప్తాడు జడ్పిటిసి జయలక్ష్మి! పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం:ఎంపీడీవో బాలాజీ సెయింట్ థెరిస్సా పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రైతుల సమక్షంలోనే భూముల రీ సర్వే చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ జగదీష్ అదహళ్లి తనిఖీలు సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

విజ్ఞాన వికాసానికి చక్కని వేదికలు గ్రంధాలయాలు : అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి : ఘనంగా ప్రారంభమైన 59వ గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
విజ్ఞాన వికాసానికి చక్కని వేదికలు గ్రంధాలయాలు : అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి : ఘనంగా ప్రారంభమైన 59వ గ్రంథాలయ వారోత్సవాలు

మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి ప్రధాన శాఖ గ్రంధాలయం నందు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఇందులో భాగంగా తొలిరోజైనా శనివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రంథాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు విద్యాశాఖ అధికారులు,ప్రముఖులు,సా హితీ వేత్తలు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సుబ్రహ్మణ్యం,సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు,ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.మునిగోపాలకృష్ణలు హాజరయ్యారు.అలాగే గౌరవ అతిథులుగా మదనపల్లె మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి,రామసముద్రం మండల విద్యాశాఖ అధికారి,రాష్ట్ర రచయితల సంఘం ఉపాధ్యక్షులు టీఎస్ఏ కృష్ణమూర్తి,డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు,విశ్రాంత లైబ్రరీ ఆఫీసర్ జనార్దన్ రెడ్డిలు పాల్గొన్నారు.మోటివేషనల్ స్పీకర్ రామ్మూర్తి,నాగరాజ,మదనపల్లె రచయితల సంఘం కార్యదర్శి యుగంధర్ ఆచారి,సినీ దర్శకుడు కరుణాకర్ తదితరులు కార్యక్రమానికి పాలు పంచుకున్నారు.ఈ సందర్భంగా డీఈఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు,ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని,గ్రంథాలయా లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.డాక్టర్ ఎన్.మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లె శాఖా గ్రంథాలయం మరింత అభివృద్ధి చెంది జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.గ్రంథాలయ అధికారిణి వసంతకుమారి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను చక్కగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు.బాలబాలికలకు బాలల దినోత్సవ విశిష్టతను వివరించారు.డా.మునిరత్నమయ్య మాట్లాడుతూ మదనపల్లె గ్రంథాలయం జిల్లాలోనే ఆదర్శ గ్రంథాలయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.అనంతరం బాలబాలికలకు నిర్వ హించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఈఓ సుబ్రహ్మణ్యం బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమం బాలబాలికల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతోపాటు గ్రంథాలయాల ప్రాధాన్యతను చాటిచెప్పింది.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి