BREAKING
భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత సాధన అద్వితీయమైన శక్తి ఈజిప్ట్‌లో గ్యాస్ ఇందన ప్రారంభించిన షెల్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి, మెదక్ జట్లు ఛాంపియన్లు వైభవంగా ఛత్ పూజ వేడుకలు.. ప్రకృతి ఆరాధనతో మార్మోగుతున్న నదీ తీరాలు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన సుడా మాజీ చైర్మన్  తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి 101 జంటలతో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం యువతకు ఉద్యోగాల కల్పనలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

గిగ్ కార్మికులకు భరోసా.. సామాజిక భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట -రూ.5 లక్షల ప్రమాద బీమా,రూ.10 లక్షల ఆరోగ్య బీమా

Select Suryaa Now
గిగ్ కార్మికులకు భరోసా.. సామాజిక భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట -రూ.5 లక్షల ప్రమాద బీమా,రూ.10 లక్షల ఆరోగ్య బీమా

పటాన్‌చెరు, ; గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు సామాజిక భద్రత కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం నూతన చట్టాన్ని రూపొందించడం అభినందనీయమని సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ నాయకులు, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహ రెడ్డి అన్నారు.శనివారం శిల్పారామం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు ఆరు లక్షల మంది గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు.ఈ పథకం ద్వారా కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమాతో పాటు వైఫై సదుపాయాలతో కూడిన విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.కార్మికుల శ్రమకు గౌరవం, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ వెస్ట్ జోన్ పరిధి నుంచి సుమారు 200 మంది కార్మికులతో కలిసి కొల్కూరి నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మంత్రి వివేక్ వెంకటస్వామి, అఖిల భారత ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ జి. సంజీవ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు అమర్ సింహా రెడ్డి, రతన్, రవి గౌడ్,అక్షిత్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.