BREAKING
నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ జగదీష్ అదహళ్లి తనిఖీలు సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు మిట్స్‌లో పోస్ట్‌గ్రెస్‌ ఎస్‌క్యూఎల్‌పై హ్యాండ్స్‌ఆన్ వర్క్‌షాప్ : ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్థులు అధికార వికేంద్రీకరణపై వెల్ష్ లేబర్ పార్టీ దారి తప్పిందన్న బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ విజ్ఞాన వికాసానికి చక్కని వేదికలు గ్రంధాలయాలు : అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి : ఘనంగా ప్రారంభమైన 59వ గ్రంథాలయ వారోత్సవాలు మెగా జాబ్ మేళా మంత్రి దామోదర్ రాజనర్సింహ l ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైసీపీపై విమర్శలా.. రూ.1,400 కోట్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా.. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటికి మేయర్ రమేష్ గౌడ్ సవాల్.. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించిన రమేష్ గౌడ్.. అనంత వెంకటరెడ్డి జిల్లాకు ఏం చేశారో మీ సీనియర్లను అడగాలని హితవు. గిగ్ కార్మికులకు భరోసా.. సామాజిక భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట -రూ.5 లక్షల ప్రమాద బీమా,రూ.10 లక్షల ఆరోగ్య బీమా నాటో సభ్యత్వానికి బదులుగా డోన్బాస్ ప్రాంతాన్ని వదులుకోవాలన్న అమెరికా ప్రతిపాదన: జెలెన్‌స్కీ సంచలన ప్రకటన మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం...... టీఎంఆర్ విద్యాసంస్థల్లో వైభవంగా బాలల దినోత్సవ వేడుకలు సంప్రదాయ దుస్తులు, విభిన్న వేషధారణలతో అలరించిన విద్యార్థులు బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం: కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో భద్రతా చర్యలు.. ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం ఏడాదిగా అసంపూర్తిగానే రోడ్డు పనులు! మల్లేపల్లి–హరిదాస్ పూర్ డబుల్ రోడ్డు నిర్మాణానికి గ్రహణం పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు -రూ.2.25 కోట్లతో సీసీ రోడ్లు, విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ

మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ

Select Suryaa Now
మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ

మర్కుక్  : మర్కుక్ మండల కేంద్రంలోని వి.బి.జి. రామ్ నిధుల కింద రెండు మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుల్లె రాణి మల్లేష్ మాట్లాడుతూ.. మండలం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మండల కేంద్రంలో మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహిళా సంఘాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు భవనాలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల నిధులతో నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మహిళా సమాఖ్యలకు ఈ భవనాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి, సమైక్యసంఘాల కార్యకలాపాలను కొనసాగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేష్,మాజీ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, వార్డు సభ్యులు సతీష్ గౌడ్, పుట్ట రవి రేఖ,పాపోల్ల రాజు కల్పన , కనకయ్య , రాజు, నాగరాజు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకం స్వామి నాయకులు బబ్బురి శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి నరేష్ కనకయ్య కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.