BREAKING
నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ జగదీష్ అదహళ్లి తనిఖీలు సెయింట్ పాల్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు మిట్స్‌లో పోస్ట్‌గ్రెస్‌ ఎస్‌క్యూఎల్‌పై హ్యాండ్స్‌ఆన్ వర్క్‌షాప్ : ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్థులు అధికార వికేంద్రీకరణపై వెల్ష్ లేబర్ పార్టీ దారి తప్పిందన్న బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ విజ్ఞాన వికాసానికి చక్కని వేదికలు గ్రంధాలయాలు : అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి : ఘనంగా ప్రారంభమైన 59వ గ్రంథాలయ వారోత్సవాలు మెగా జాబ్ మేళా మంత్రి దామోదర్ రాజనర్సింహ l ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైసీపీపై విమర్శలా.. రూ.1,400 కోట్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా.. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటికి మేయర్ రమేష్ గౌడ్ సవాల్.. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించిన రమేష్ గౌడ్.. అనంత వెంకటరెడ్డి జిల్లాకు ఏం చేశారో మీ సీనియర్లను అడగాలని హితవు. గిగ్ కార్మికులకు భరోసా.. సామాజిక భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట -రూ.5 లక్షల ప్రమాద బీమా,రూ.10 లక్షల ఆరోగ్య బీమా నాటో సభ్యత్వానికి బదులుగా డోన్బాస్ ప్రాంతాన్ని వదులుకోవాలన్న అమెరికా ప్రతిపాదన: జెలెన్‌స్కీ సంచలన ప్రకటన మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం...... టీఎంఆర్ విద్యాసంస్థల్లో వైభవంగా బాలల దినోత్సవ వేడుకలు సంప్రదాయ దుస్తులు, విభిన్న వేషధారణలతో అలరించిన విద్యార్థులు బాలల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం: కరస్పాండెంట్ మనోహర్ రెడ్డి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో భద్రతా చర్యలు.. ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం ఏడాదిగా అసంపూర్తిగానే రోడ్డు పనులు! మల్లేపల్లి–హరిదాస్ పూర్ డబుల్ రోడ్డు నిర్మాణానికి గ్రహణం పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు -రూ.2.25 కోట్లతో సీసీ రోడ్లు, విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ

పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు -రూ.2.25 కోట్లతో సీసీ రోడ్లు,

Select Suryaa Now
పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు -రూ.2.25 కోట్లతో సీసీ రోడ్లు,

పటాన్‌చెరు, ; పటాన్‌చెరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రతి కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.శనివారం పటాన్‌చెరు, జేపీ కాలనీ డివిజన్ల పరిధిలోని వివిధ కాలనీలలో రూ.2 కోట్ల 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ (యూజీడీ), వర్షపు నీటి కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తాగునీరు,విద్యుత్, పారిశుద్ధ్యం, రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలనీల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు.నూతన సీసీ రోడ్ల నిర్మాణంతో కాలనీల్లో రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో మురుగునీటి సమస్యకు, వర్షపు నీటి కాలువల నిర్మాణంతో వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ప్రజల సహకారంతో ప్రతి కాలనీకి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, నర్రా బిక్షపతి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ చారి, ప్రకాష్ రావు, పృథ్వీరాజ్, వెంకటేష్,ఆశమ్,రామ్మోహన్, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.