గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం.
తొగుట -గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ఇలాంటి అవకాశాలు యువతకు స్ఫూర్తిదాయకమని రజక జాతీయ అధ్యక్షులు నడిమింటి శ్రీనివాస్, టీఆర్ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ విజయ్ గణేష్ లు అన్నారు. శనివారం టీజీ 20 క్రికెట్ లీగ్ మ్యాచ్ కు మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన గణపతి భాను (రజక) ఎంపికైన సందర్భంగా రజక జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, నాయకులు సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామీణ యువకుడు రజక జాతి ముద్దు బిడ్డకు అరుదైన గౌరవం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా క్రీడారంగంలో మరో ప్రతిభ వెలుగులోకి వచ్చిందని, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నర్లు చెప్పారు. ఈ సందర్బంగా గణపతి భానును నాయకులు సన్మానించారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి రాష్ట్రస్థాయి క్రికెట్‌లో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ లీగ్‌ను నిర్వహించనున్నారని వివరించారు. ఇందులో భాగంగా గజ్వేల్ టైటాన్స్ జట్టు తరఫున గణపతి భాను ఎంపిక కావడం విశేషం అన్నారు. స్థానిక స్థాయిలో తన ఆటతీరుతో గుర్తింపు పొందిన భాను.. ఇప్పుడు రాష్ట్రస్థాయి వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమవడం అభినందనీయం అన్నారు.
సిద్దిపేట జిల్లా నుంచి టీజీ 20 లీగ్‌కు ఎంపిక కావడం పట్ల క్రీడాభిమానులు, యువ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే పోటీల్లో గణపతి భాను రాణించి జిల్లాకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంబరాజు కుమార్, ప్రధాన కార్యదర్శి కొలిపాక లక్ష్మణ్, కన్వీనర్ చాగంటి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, గౌరవ అధ్యక్షులు క్యాసర్ల యాదగిరి, జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ దీటి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు, నాయకులు, మండల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.