BREAKING
పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు -రూ.2.25 కోట్లతో సీసీ రోడ్లు, విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ స్థానిక సంస్థల ఎన్నికలు సుప్రీంకోర్టు ఆదేశాలను చేయాలి కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు

పల్లెలకు పాకిన గంజాయి మత్తు!?

Select Suryaa Now
పల్లెలకు పాకిన గంజాయి మత్తు!?

హుస్నాబాద్  :. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పల్లెల్లో ఇప్పుడు గంజాయి మత్తు కలకలం రేపుతోందా? చదువుకోవాల్సిన వయసులో కొందరు యువకులు మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరదాగా మొదలయ్యే చెడు అలవాట్లు క్రమంగా వ్యసనంగా మారి యువత జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఈజీ మనీ సంపాదించాలనే ఆశతో కొందరు యువకులు గంజాయి విక్రయాల వైపు మళ్లుతున్నారనే ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తాము వినియోగదారులుగా ప్రారంభించి, ఆ తర్వాత ఇతరులకు సరఫరా చేసే స్థాయికి చేరుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులను కలవరపెడుతోంది.

పట్టించుకునేవారేరి?

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మత్తుపై గ్రామస్థాయిలోనే నిఘా అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విద్యాసంస్థలు, యువత ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలు, అనుమానాస్పద కార్యకలాపాలు జరిగే ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గంజాయి విక్రయాల వెనుక ఉన్న మూలాలను గుర్తించి, సరఫరా వ్యవస్థను ఛేదించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.

పోలీసులకు సవాలుగా మారిన మత్తు వ్యాపారం!

గంజాయి వినియోగం, అక్రమ విక్రయాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతర నిఘా, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కేవలం వినియోగదారులపైనే కాకుండా, గంజాయి సరఫరా చేస్తున్న అసలు వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో మత్తుకు బానిసైన యువతకు కౌన్సెలింగ్, పునరావాసం కల్పించాలి.

ఇప్పటికైనా మేల్కొనకపోతే రేపటి తరం పరిస్థితి ఏమిటి?

యువత దేశ భవిష్యత్తు అని చెప్పుకుంటున్న మన సమాజంలో అదే యువత మత్తు పదార్థాలకు బానిసైతే భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు పోలీసులు సమన్వయంతో పని చేస్తూ గంజాయి మహమ్మారికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది పల్లెల్లో మత్తు ముఠాలకు చోటు లేకుండా ప్రజల భాగస్వామ్యంతో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజల్లో అభిప్రాయాలు వెలబడుతున్నాయి.