BREAKING
పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు పరుగులు -రూ.2.25 కోట్లతో సీసీ రోడ్లు, విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ స్థానిక సంస్థల ఎన్నికలు సుప్రీంకోర్టు ఆదేశాలను చేయాలి కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు

నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్

Select Suryaa Now
నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్

హుస్నాబాద్   ; భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, అందుకే చిన్నారులు ఆయనను ప్రేమగా చాచా నెహ్రూ అని పిలుచుకునేవారని గాంధీనగర్ గ్రామ సర్పంచ్ పోలు సంపత్ అన్నారు. నెహ్రూ జయంతి, జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీనగర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోలు సంపత్ మాట్లాడుతూ.. పిల్లల పట్ల నెహ్రూకు ఉన్న ప్రేమ, వారి భవిష్యత్తుపై ఆయనకున్న దూరదృష్టి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పిల్లలను చదువులో ప్రోత్సహిస్తూ, మంచి విలువలు నేర్పించి ఉన్నత లక్ష్యాల వైపు నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. బాల కార్మిక వ్యవస్థ సమాజానికి మాయని మచ్చ అని, చిన్నారుల చేతుల్లో పుస్తకాలు ఉండాల్సిన చోట పనిముట్లు ఉండకూడదని పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బాల్యవివాహాలు చిన్నారుల జీవితాలను, భవిష్యత్తును దెబ్బతీస్తాయని, వాటిని అరికట్టేందుకు గ్రామస్థులు అవగాహనతో వ్యవహరించాలని కోరారు. ప్రతి బాలబాలికకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, రక్షణతో కూడిన బాల్యాన్ని అందించాల్సిన బాధ్యత కుటుంబంతో పాటు సమాజంపై కూడా ఉందన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు దేశ అభివృద్ధికి మార్గదర్శకులుగా ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణాదేవి, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రేయ, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.