తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి
గార్ల, మేజర్ న్యూస్, పినిరెడ్డిగూడెంలో తాగు నీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి, శాశ్వతంగా తాగు నీటి సరఫరాలో నిత్యం ఎదురుకొనుటున్న అక్కడి ప్రజలను పరిష్కరించాలని సిపియం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వంగూరి పెద్ద వెంకటేశ్వర్లు, మల్లెల నాగమణి లు డిమాండ్ చేశారు. మండల పరిధి పినిరెడ్డిగూడెం, సుందరయ్య కాలనిలో బానోత్ నరేష్ అధ్యక్షతన జరిగిన సిపియం గ్రామ శాఖ సమావేశంలో వారు మాట్లాడుతూ..ఇక్కడ తాగు నీటి బావి ఉన్నప్పటికీ "లో ఓల్టేజ్" కారణంగా తాగు నీటి సమస్య పదే పదే ఎదురవుతుందని, అక్కడ ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలన్నారు. పాత, కొత్త పోచారాలకు వెళ్ళే క్రాస్ రోడ్డు నుండి ప్రతి రోజు రాత్రి 7 గంటల సమయంలో మహిళలు వివిధ కూలి పనుల రిత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లి, సుమారుగా అర కిలోమీటర్ దూరం వరకు చిమ్మని చీకట్లో కాలి నడకన ప్రయాణం చేయాల్సి వస్తుందని, విద్యుత్ అధికారులు, పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తాగు నీటి సమస్య సత్వరమే పరిష్కరించాలని, అదే విధంగా వీధిలైట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు చింత ఎల్లయ్య, శాఖ కార్యదర్శి వంగూరి కొండయ్య, వార్డు సభ్యులు, శాఖ సభ్యులు గుగులోత్ సీతరాo, బానోత్ ఝాన్సీ, బానోత్ నరేష్, మాలోత్ వెంకట్, మాజీ ఎంపీటీసీ పద్మ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; నాగేశ్వరరావు, గార్ల, మహబూబాద్ జిల్లా