telangana
సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ.
సూర్య,కాగజ్‌నగర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని సార్సాల గ్రామంలో మహిళా సంఘాల కార్యకలాపాలకు సొంత వసతి కల్పించే లక్ష్యంతో నిర్మించనున్న విఓ భవనానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ శనివారం భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడారు. మహిళలు సంఘటితంగా ముందుకు సాగుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాలకు భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సార్సాల సర్పంచ్ కొండగోర్ల ప్రకాష్, నాగంపేట సర్పంచ్ లింగయ్య, మాజీ సర్పంచ్ బొమ్మల కిషన్, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.