గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు
మహబూబాబాద్, మేజర్ న్యూస్,
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో స్వయం పాలన దినోత్సవం, బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చాచా నెహ్రూ వేషధారణలో సందడి చేశారు. ఆటపాటలు, నృత్యాలు, గేయాలు, సమాచారాత్మక ప్రసంగాలతో అలరించారు. స్వయం పాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులే ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తరగతి గదుల్లో పాఠాలు బోధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకు సైతం పురస్కారాలు ప్రదానం చేశారు. చదువుతోపాటు క్రీడలు, యోగా, కరాటే, నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌లో విద్యార్థులు ప్రతిభ చాటుతూ పలు విజయాలు సాధిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసం, ప్రేరణాత్మక ప్రసంగాల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సైతం పాటలు, నృత్యాలతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ కోన కంచి రామకృష్ణ, డైరెక్టర్లు గంధం దేవేందర్, శ్రీరామ్ కిరణ్ కుమార్, మమత, ప్రిన్సిపాళ్లు నరసింహారావు, శ్రీలక్ష్మి, ప్రియాంక సర్కార్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్; మహేష్ ,మహబూబాబాద్, మహబూబాబాద్ జిల్లా