BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి

Select Suryaa Now
నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు  188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మున్సిపాలిటీల పరిధిలోని 188 వార్డులకు మొత్తం 443 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 40 అత్యంత సమస్యాత్మక, 47 సమస్యాత్మక కేంద్రాలుగా మొత్తం 87 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఆయా కేంద్రాల్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.

శనివారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.

నవంబర్ 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన, 19న తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. నవంబర్ 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో ఎన్నికల భద్రతను పర్యవేక్షిస్తామని, ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించి ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు పాల్గొన్నారు.