BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

ఘనంగా బాలల దినోత్సవం

Select Suryaa Now
ఘనంగా బాలల దినోత్సవం

శ్రీకాళహస్తి:

శ్రీకాళహస్తి రూరల్ మండలం బివి పురం కాలనీలో ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో క్రై బెంగళూరు వారి సహకారంతో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలోని పిల్లల చేతుల్లోనే బాలల భవిష్యత్తు ఉంటుందని నేటి బాలల ఆలోచనలు ఆశయాలు విద్యా సంస్కారం రేపటి సమాజానికి పునాదులు వేస్తాయని తెలిపారు బాలల హక్కులు కాపాడుకోవాలని రక్షణ పొందే హక్కు ఉచిత విద్యా హక్కు పాల్గొనే హక్కు అభివృద్ధి చెందే హక్కు గురించి విపులంగా తెలియజేశారు కో కన్వీనర్ రామచంద్ర మాట్లాడుతూ గ్రామాల్లో బాలల సంఘాలు సమావేశాల్లో పిల్లలు చురుగ్గా పాల్గొని బాలల యొక్క సమస్యలు పెద్దలు దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని బాల్య వివాహాలు నిర్మూలనకు కృషి చేయాలని బాగా చదువుకొని అభివృద్ధి సాధించాలని కోరారు అనంతరం ప్రగతి సంస్థ బాలలకు ఆట పోటీలు నిర్వహించి ఆట వస్తువులు స్కిప్పింగ్ బాల్స్ రింగులు అందజేసి బహుమతులు అందించారు అనంతరం పిల్లలందరికీ బాలహక్కులు కాపాడుకుందాం అని రక్షించుకుందామని గ్రామంలో ర్యాలీ నిర్వహించి బాల్య వివాహ వ్యవస్థ నిర్మూలిస్తాం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.